calender_icon.png 18 February, 2026 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొడిచన్‌పల్లి తండాలో ఉచిత వైద్యశిబిరం

18-02-2026 12:10:52 AM

పాపన్నపేట,ఫిబ్రవరి17:మండల పరిధిలోని పొడిచినపల్లి తాండ గ్రామపంచాయ తీలో మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచి త వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బుజ్జి ప్రారంభించారు.

ఈ సందర్బంగా డయాభేటీస్, రక్తపోటు, థై రాయిడ్, దీర్ఘకాలం సమస్యలు, మోకాళ్ళ నొ ప్పులు, ఆస్తమా, డెంగ్యూ, మలేరియా వంటి వాటికి మల్లారెడ్డి హాస్పిటల్ నందు ఉచిత వైద్యసేవలు అందుబాటులో ఉన్నట్టు అస్ప త్రి ప్రతినిధులు తెలిపారు. గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి హాస్పిటల్ నందు సంప్రదించాలని తెలిపారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

పొడిచన్పల్లి తాండకు చెందిన లకావత్ సంతోష్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రి లో చికిత్స పొందాడు. ముఖ్యమంత్రి సహా య నిధికి దరఖాస్తు చేసుకున్న ఇతనికి ప్ర భుత్వం రూ.17,500 మంజూరు చేసింది. ఇ ట్టి చెక్కును మంగళవారం రోజున కాంగ్రెస్ నాయకులు అతనికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవింద్ నాయక్, నాయకులు రవి, బిక్య, శ్రీ ను, లాల్ సింగ్, మనోజ్, మురళి ఉన్నారు.