calender_icon.png 8 August, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాస్కులర్ డే సందర్భంగా నెలంతా ఉచిత వైద్య సేవలు

08-08-2025 07:14:18 PM

మెడిసిటీ సీఈవో ఐనిష్ మర్చంట్..

మేడ్చల్ (విజయక్రాంతి): వాస్కులర్ డే సందర్భంగా మేడ్చల్ లోని మెడినోవా ఆసుపత్రి(Medinova Super Speciality Hospital)లో ఈ నెల అంతా ఆ వ్యాధికి సంబంధించి ఉచిత వైద్య సేవలు అందించనున్నామని మెడిసిటీ సీఈవో ఐనిష్ మర్చంట్ తెలిపారు. కన్సల్టేషన్ తో పాటు డాప్లర్ పరీక్షను ఉచితంగా చేస్తామన్నారు. శుక్రవారం మెడినోవ ఆసుపత్రిలో వాస్కులర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వాస్కులర్ సర్జరీ విభాగాన్ని ఆయన ప్రారంభించారు.

వాస్కులర్ సర్జరీ విభాగం ద్వారా డయాబెటిక్ ఫుట్ గ్యాంగ్రిన్, వరికోస్ వేయిన్స్, కిడ్నీ డయాలసిస్, ఫిస్టులా సర్జరీలు, స్ట్రోక్ రాకుండా క్యారో కిడ్ సర్జరీల ద్వారా నైపుణ్యం కలిగిన వైద్య సేవలు అందిస్తామన్నారు. డయాబెటిక్ పేషెంట్ల కాళ్లను తొలగించాల్సిన అవసరం లేకుండా రక్త ప్రసరణను పెంచే ఇంటర్వెన్షన్ ల ద్వారా అవి రక్షించబడతాయన్నారు. మెడినోవ ఆసుపత్రిలో మెడిసిటీ భాగస్వామిగా చేరిందని, ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కే శివరామకృష్ణ, డాక్టర్ సత్యేంద్ర రామనాథ్, డాక్టర్ సల్మాన్, డాక్టర్ సి గీత, మెడిసిటీ వైద్యులు సోనియా రెడ్డి, కార్తీక్, మనోజ్, నితేష్, క్రాంతి, మురళి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.