08-08-2025 09:57:05 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్(ACP Ravikumar) అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి ఆటోలు నడపవద్దని కోరారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆటోలను నడపాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని కోరారు. ప్రతి ఆటోడ్రైవర్ సరైన ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నారు. ఆటో డ్రైవర్లు ఏదైనా సమస్య తలెత్తితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఏసిపి రవికుమార్ కోరారు.