08-08-2025 10:05:47 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల(Mancherial) పట్టణంలోని అభ్యాస పాఠశాలలో భారీ రాఖీ రూపొందించారు. విద్యార్థులు శుక్రవారం పాఠశాల ఆవరణలో సుమారు 70 అడుగుల రాఖీని 50 మంది విద్యార్థులు రూపొందించి ప్రదర్శించారు. సోదర సోదరీ భావం పెంపొందించేందుకే వినూత్నంగా రాఖీని రూపొందించినట్లు యాజమాన్యం తెలిపారు. అనంతరం పాఠశాలలో రక్షాబందన్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధతి, కరస్పాండెంట్ సాన గిరీష్ కుమార్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.