07-05-2025 12:00:00 AM
కోదాడ, మే 6: పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాం గణంలో మంగళవారం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సారధ్యం లో “తెలంగాణ రైజింగ్ - యంగ్ ఇండి యా” ఉచిత వేసవి శిక్షణ శిబిరం” ప్రారంభం జరిగింది. కోదాడ మండ ల విద్యాధికారి ఎండీ సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడుతూ బాల్యం ఆట, పాట మాట, మంచి నడవడికతో గడపాలని,
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులలో “తెలంగాణ రైజింగ్ - యంగ్ ఇండియా” శిక్ష ణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం, ము ఖ్యంగా నృత్యం, చిత్రలేఖనం, వాలీబాల్, శాస్త్రీయ వైఖ రులు, వ్యక్తిత్వ వికాస నిర్మాణం అంశాల పట్ల శిక్షణ ఇస్తుందన్నారు. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మా ర్కండేయ, మీనాక్షి, శ్రీనివాసరెడ్డి, పద్మావతి, ఖజామియా, జానకి రామ్, బడుగుల సైదులు, సురేషు, పాల్గొన్నారు.