14-05-2025 12:00:00 AM
కమిషనర్ బి. సైదులుకు హెల్త్ సూపర్వైజర్స్ అసోషన్ వినతి
ముషీరాబాద్, మే 13 (విజయక్రాంతి): బీసీ రెసిడెన్షియల్ స్కూల్ హెల్త్ సూపర్వైజర్ల టైం టేబుల్ సమస్యను పరిష్కరించా లని హెల్త్ సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కే.జయమ్మ బి.జ్యోతి, సి. సరస్వత మ్మలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస బ్ ట్యాంక్ లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో కమిషనర్ బి.సైదులు కలిసి విన తిపత్రం అందజేసినట్లు వారు వెల్లడించారు.
ముందుగా నర్సెస్ డే సందర్భంగా పూల బొకేెను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మ హాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలు, కాలేజీలలో పనిచేయుచున్నటువంటి హెల్త్ సూపర్వైజర్‌లు ఎదుర్కొంటున్నటువంటి డ్యూటీ టైంకు సంబంధించిన అంశం ప్రదానంశంగా ఉన్నదని, ప్రస్తుతం ఉన్న టైం ఉద యం 6:45 నుండి 11. 15 గంటల వరకు, మధ్యాహ్నం 01.15 నుంచి 2.30 గంటల వ రకు, సాయంత్రం నాలుగున్నర నుండి 7: 00 వరకు,ఈ విధంగా టైం టేబుల్ ఉండ టం వలన విద్యార్థులకు హెల్త్ విషయంలో సరైన సమయం కేటాయించ లేక పోతున్నామన్నారు.
ఉదయం 11 గంటలకు మాకు బ్రే క్ టైం ఉండగా, అదే సమయంలో ఆస్పత్రు ల్లో డాక్టర్లు వచ్చే సమయం ఉండడం వలన పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లా లేకపోతున్నామన్నారు.మనకున్నటువంటి అన్ని హాస్టల్లో కూ డా రేంటెడ్ బిల్డింగులు అయినందువలన తాము ఉంటున్నటువంటి కిరాయి ఇల్లు కూడా హాస్టల్‌కు దూరంగా ఉండడం మూ డు సమయాలు వెళ్లి రావడం వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు పేర్కొన్నా రు.
రెసిడెన్షియల్ స్కూల్‌లలో ఉన్నటువంటి ఈ టైం టేబుల్‌ని కంటిన్యూస్‌గా 8 గంటలు ఉండే విధంగా టైం సెట్ చేయడం ద్వారా తాము విద్యార్థులకు పూర్తి టైం ఎనిమిది గంటల కేటాయించి పనిచేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. క మిషనర్ బి. సైదులు స్పందించి హెల్త్ సూ పెర్వైసర్స్ సమస్యలను పరిశీలించి పరిస్కారం చేస్తామ ని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.