calender_icon.png 4 August, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచినీళ్ళ వ్యాపారం

26-06-2024 12:05:00 AM

రాష్ట్రంలో మినరల్ వాటర్ పేరిట అక్రమ వ్యాపారం ‘మూడు పూవులు ఆరు కాయలు’గా సాగుతున్నది. పల్లెలు, పట్టణాలు, నగరాలలో గుర్తింపు లేని వాటర్ ప్లాంట్‌లు పుట్ట గొడుగులవలె పుట్టుకు వచ్చి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీయడం దురదృష్టకరం. ఒకవైపు నీటి బాధలు తీరుస్తున్నారని సంతోషించాలా మరోవైపు నాణ్యత లేని జలాలను అందిస్తున్నందుకు బాధపడాలో తెలియని స్థితి. నాణ్యత లేని నీళ్ల వ్యాపారాన్ని అధికారులు అనుమతించకూడదు. కనీసం వాటర్ క్యాన్‌లు శుభ్రంగానైనా వుండవు. ఉన్నతాధికారులు స్పందిం చి తగు చర్యలు తీసుకోవాలి.

-కె. సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా