8 July, 2026 | 7:58 PM

Breaking News

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •  

85 శాతం ఇంజనీరింగ్ ఫ్రెషర్లనే తీసుకున్నాం

13-05-2024 12:05 AM

ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా

న్యూఢిల్లీ, మే 12: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్థిక సంవత్సరం చేరనున్న 12,000 మంది ఫ్రెషర్లలో 85 శాతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లేనని బ్యాంక్ చైర్మన్ దినేశ్ ఖారా వెల్లడించారు. ప్రొబేషనరీ ఆఫీసర్లు, అసోసియేట్స్‌గా 12,000 మంది ఫ్రెషర్లను తీసుకునే ప్రక్రియలో ఉన్నామని, ఆ ర్యాంకుల్లోకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించడానికి సమస్య ఏదీ లేదని ఖారా వివరించారు. కొంత బ్యాంకింగ్ పరిజ్ఞానం కలిగిన 3000 మందికిపైగా పీవోలు, 8,000కుపైగా అసోసియేట్లకు శిక్షణ ఇచ్చిన అనంతరం వివిధ బిజినెస్ రోల్స్‌లో నియమిస్తామన్నారు. బ్యాంకింగ్ రంగం టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో, కస్టమర్లకు వినూత్న సేవల్ని అందించే క్రమంలో కొన్ని బ్యాంక్‌లు ఇంజనీర్ల నియామకానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఫ్రెషర్లకు బ్యాంకింగ్‌లో శిక్షణ ఇచ్చిన తర్వాత వారి ఆప్టిట్యూడ్, టెంపర్‌మెంట్‌లకు అనుగుణంగా బిజినెస్, ఐటీ తదితర రోల్స్‌లోకి పంపిస్తామని ఎస్బీఐ చైర్మన్ తెలిపారు. తమ మానవ వనరులకు శిక్షణ ఇచ్చేందుకు బ్యాంక్ భారీగా పెట్టుబడి చేస్తున్నదని, టెక్నాలజీ నైపుణ్యాన్ని మెరుగుపర్చడానికి సొంతంగా ఒక ఇనిస్టిట్యూట్ ఉన్నదని ఖారా చెప్పారు.