02-11-2025 07:37:10 PM
పంచుకున్న జ్ఞాపకాలు..
ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్న పూర్వ విద్యార్థులు..
గరిడేపల్లి (విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలోని కల్మలచెరువు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984-85 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న నాటి విద్యార్థులంతా ఒకచోట చేరి వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. వారు ఆడిన ఆటలను చేసిన చిలిపి పనులను గుర్తు చేసుకున్నారు. నేటి స్థితిగతులను ఒకరినొకరు అడిగి తెలుసుకుని ఆనందంగా గడిపారు. 40 సంవత్సరాల తర్వాత తామంతా ఒకచోట కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
తమకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నతంగా ఎదిగేలా తీర్చిదిద్దిన అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ నాటి విద్యార్థులంతా వివిధ రంగాలలో ఉన్నత స్థితిలో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆటపాటలతో సరదాగా సందడి చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు నారాయణరెడ్డి, పి.వీరబాబు, విజయ కుమారినీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు 60 మంది పాల్గొనడం జరిగిందన్నారు. పూర్వ విద్యార్థులు ఎడవెల్లి వెంకటరెడ్డి, కంబాలపల్లి వెంకటనారాయణ, కడియం వెంకట్ రెడ్డి, అనంతరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.