03-08-2025 08:37:36 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ నక్కలగుట్ట ఏక నగర్ ప్రాంతంలో బలరం బండిని పోచమ్మ బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తౌట్ రెడ్డి, రవీందర్ రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ముఖ్య అతి థిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగలను రాష్ట్రవ్యాప్తంగా సాంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా నిర్వహిస్తున్నారని భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
పోలీసులు పురవీధుల్లో ప్రదర్శనకు భద్రతా చర్యలు చేపట్టారు. పోచమ్మ తల్లి ప్రదర్శన నగర ప్రధాన వీధుల్లో ర్యాలీగా వేలాదిమంది భక్తులతో పోచమ్మ గుడి వరకు నిర్వహించారు. తప్పు వాయిద్యాలతో నృత్య ప్రదర్శ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.