03-08-2025 08:45:45 PM
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటరమణ హిల్స్ కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు దాతల సహకారంతో అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మించి. మూడు రోజులపాటు విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను నిర్వహించి సామూహిక అర్చనలు, అభిషేకాలు, హోమాలు, నిర్వహించారు. ఆదివారం వేద పండితులు నిర్ణయించిన సుముహూర్తంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, పిర్జాది గూడ మాజీ మేయర్ అమర్ సింగ్ పలువురు మాజీ కార్పొరేటర్లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.