03-08-2025 08:32:05 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్‌కు గురైన బాలికను పోలీసులు రక్షించారు. బాచుపల్లి సీఐ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఒడిస్సా రాష్ట్రం, కేంద్రపడ జిల్లా, సాహిరా గ్రామానికి చెందిన బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి బాచుపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉంచారు.
కిడ్నాప్ గురైన బాలిక సమాచారం సౌత్ ఏసియా ఉమెన్ ఫౌండేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ తన్విసింగ్ శనివారం రాత్రి బాచుపల్లి పోలీస్ లకు చేరవేశారు. బాలికను కిడ్నాప్ చేసి ఇందిరమ్మ ఇంటిలో దాచినట్లు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన బాచుపల్లి పోలీసులు బాలికను కిడ్నాప్ నుండి విడిపించారు. అనంతరం బాలిక సేఫ్ కస్టడీ కోసం సూరారంలోని సఖి సెంటర్ కు తరలించారు. ఆ తర్వాత పేరెంట్స్ , ఒడిస్సా పోలీసులకు బాలికను అప్పగించారు.కిడ్నాప్ చేసిన నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.