23-01-2026 12:56:55 AM
ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారితనం
పేదలకు, రైతులకు అండదండగా నిలవడమే ప్రధాన ధ్యేయం
రాజన్న సిరిసిల్ల జిల్లాతో ప్రత్యేక అనుబంధం
అంచలంచెలుగా ఎదిగిన శ్యాం ప్రసాద్ లాల్
బోయినపల్లి: జనవరి 22(విజయ క్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కు చెందిన బీడీ కార్మిక కుటుంబం నుంచి ఐఏఎస్ సాధించిన జీవి శ్యాం ప్ర సాద్ లాల్. ఉమ్మడి కరుణ జిల్లా హుస్నాబాద్ కు చెందిన రాజేశం _సత్యవతి దంప తు లకు చెందిన మొదటి కుమారుడు జివి శ్యాం ప్రసాద్ లాల్ కంప్యూటర్ చదివారు. పీజీ అనంతరం ఉద్యోగ వేటలో ప్రముఖ దినపత్రికలో ఉపసంపాదకులుగా పనిచేశా రు. అనంతరం 1995లో గ్రూప్ 2 పరీక్ష రా సి తాసిల్దారుగా ఎంపికయ్యారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా గంభీరావుపేట డి ప్యూటీ తాసిల్దారుగా పనిచేశారు.
అనంతరం బోయినపల్లి మండలం తాసిల్దారుగా పదోన్నతి రాగా మంథని మండలానికి బదిలీ అ య్యారు. మళ్లీ ఒక రోజులోనే బోయినపల్లి మండలానికి తాసిల్దారుగా వచ్చి చేరారు. అ నంతరం ఐదేళ్లు బోయినపల్లి మండలంలో పనిచేసే ప్రజలతో నేరుగా సంబంధాలు పె ట్టుకుని భూ సమస్యలను పరిష్కారం చేశా రు. ముఖ్యంగా అప్పటి కలెక్టర్ సుమిత డ వ్రా చదువుల పండుగ కార్యక్రమంలో చురుకుగాపాల్గొని ఆ కార్యక్రమం సక్రమంగా అమలు చేసినందుకు తాసిల్దార్ శ్యాం ప్రసాదాలను ప్రత్యేకంగా అభినందించి 15 ఆగస్టు నాడు ప్రశంసా పత్రం అందించారు.
అనంతరం బోయినపల్లి నుంచి సిరిసిల్ల, పెద్దపెల్లి, కోరుట్ల ,కరీంనగర్, హుజురాబాద్ తాసిల్దారుగా పనిచేశారు. అనంతరం ఆర్డిఓ గా ప దోన్నతి రాగా, బైంసా, హనుమకొండ, భూ సేకరణ విభాగం(కరీంనగర్) సిరిసిల్ల ఆర్డీవో గా పనిచేశారు. అనంతరం మళ్లీ పదోన్నతి పై సిరిసిల్ల, కరీంనగర్లో డిఆర్‌ఓ గా పనిచేశా రు. ఈ సమయంలో మధ్యాహ్నం భూ సమస్యలను పరిష్కారం చేసి భూ నిర్వాసితులకు పరిహారం అందించారు.
అనంతరం జా యింట్ కలెక్టర్ గా పదోన్నతి పై కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ గురుకులాల జాయింటు సెక్రటరీగా ప్రగతి భవన్ లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 16 మంది జాయింట్ కలెక్టర్లకు బుధవారం కన్ఫామ్ ఐఏఎస్ గా పదోన్నతి ఇవ్వగా అం దులో బీసీ గురుకులాల జాయింట్ సెక్రెటరీ జీవి శ్యాం ప్రసాద్ లాల్ ఆ జాబితాలో ఉం డి ఐఏఎస్ సాధించారు. ఈ తరుణంలో ఆ యనకు రాజన్న సిరిసిల్ల జిల్లాతో, ఇక్కడి ప్ర జలు రైతులు నేతలతో ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నారు.
ఆయన ఎక్కడైనా పనిచేసిన అక్కడ ప్రజలతో అన్ని వర్గాలతో సత్ సం బంధాలు కలిగి ఉంటారు. ప్రజల రైతుల స మస్యలను చక్కగా పరిష్కారం చేస్తారు. అదేవిధంగా ప్రతిపక్ష విపక్ష నేతలను కూడా చ క్కర సంబంధాలను కలిగి ఉండి సంక్షేమ ప థకాలను చక్కగా అమలు చేసి అర్హులైన పెద ప్రజలకు అందిస్తారు. ముఖ్యంగా తాను తా సిల్దారుగా , ఆర్డీవో గా,డీఆర్వో గా రాజన్న సి రిసిల్ల జిల్లాలో ఎక్కువ కాలం పని చేశారు. దీంతో జిల్లా ప్రజలతో నాయకులతో సత్ సం బంధాలు కలిగి ఉన్నారు. ఆయనకు ఐ ఏఎస్ కన్ఫామ్ కావడంతో రాజన్న సిరిసిల్ల ప్రజల్లో నాయకుల్లో ఆనందం నెలకొన్నది.