23-01-2026 12:56:39 AM
ఏఐఎన్‌యూలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధితో ఎండ్స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్‌కు గురైన కెన్యాకు చెందిన మహిళకు హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) హైటెక్ సిటీ వైద్యులు కొత్త జీవితం అందించారు. కెన్యాకు చెందిన 55 ఏళ్ల ఫతుమో మొహ్మద్ డుబో కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. కెన్యా వైద్యల సూచనతో ఆమె భారత్‌కు వచ్చి, ఏఐఎన్‌యూలో చేరారు. వైద్యులు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జీవదాత ద్వారా కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించారు. ఆమె సోదరి కిడ్నీ దానానికి ముందుకొచ్చారు.
దీంతో గత ఏడాది సెప్టెంబర్లో ఒకే సెషన్లో దాత నుంచి కిడ్నీ తీసి స్వీకర్తకు అమర్చామని ఏఐఎన్‌యూ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కె.క్రాంతికు మార్ తెలిపారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సను ఏఐఎన్‌యూ ట్రా న్స్‌ప్లాంట్ సర్జన్లు, నెఫ్రాలజిస్టులు, అనస్థీషియా, క్రిటికల్ కేర్ నిపుణుల బృందం విజయవంతంగా నిర్వహించారు. దీంతో బాధితురాలు మాట్లాడుతూ.. ఇక్కడి వైద్యు లు నాకు మళ్లీ జీవించే అవకాశం ఇచ్చారు. ప్రతి దశను స్పష్టంగా వివరించి మాకు అండగా నిలిచారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ దీపక్ రగూరి, డాక్టర్ ఎమ్.డి.తైఫ్ బెండిగేరి, డాక్టర్. సయ్యద్ ఎమ్.డి. ఘౌస్, డాక్టర్. దీక్ష ప్రియలతో కూడిన వైద్యబృందం విజయవంతం గా నిర్వహించింది.