24-08-2025 12:39:43 AM
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాం తి): సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో మద్యం ఫుల్లు.. ఎరువులు నిల్లు అని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఒకవైపు యూరియా కొరతతో రైతాంగం అల్లకల్లో లం అవుతుంటే అధికార పక్షం దాన్ని ప్రతిపక్షాల దుష్ప్రచారంగా చెప్పడం సిగ్గుచేటన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా ఉందన్నారు.
కుండపోత వానలో తడుస్తూ రైతులు గంటల కొద్దీ నిలబడటం అబద్దమా? చెప్పులు క్యూ లైన్లలో పెట్టడం అబద్ద మా? అని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న యూరియా అడిగితే పోలీసు లాఠీలతో కొట్టించింది అబద్దమా? అని నిలదీశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్లనే కదా ఈరోజు రైతులకు ఇన్ని కష్టాలు వచ్చాయని, ఈ సీఎంకు ముందు చూపు లేకపోవడం వల్లనే రైతులు కన్నీళ్లు పెట్టాల్సి వస్తున్నదని మండిపడ్డారు.
తులం బంగారం ఇస్తామంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, బంగారం మాట దేవుడెరుగు యూరియానే బంగారం గా మార్చిండన్నారు. నాటి రోజులు తెస్తామని పదే పదే చెప్పే రేవంత్‌రెడ్డి..అన్నమాట నిలుపుకుంటున్నారని తెలిపారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు ఏనా డూ యూరియా కొరత రాలేదని, మిస్ వరల్డ్ పేరిట ౨ నెలలు పాలనను గాలికి వదిలేసిండని ఆరోపించారు.
బాధ్యత లేదు.. ప్రణాళిక లేదు
ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతగా ఉండాలనే సోయి కూడా లేకుండా ప్రతి వైఫల్యాన్ని బీఆర్‌ఎస్, కేసీఆర్‌పై వేస్తూ రంకెలేయడం తప్ప ఇంతవరకు ఒరగబెట్టిందేమీలేదన్నా రు. ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి చేతగాని తనం వల్లనే రాష్ట్రానికి ఎరువుల కొరత వచ్చిందని విమర్శించారు.
ఈ ప్రభుత్వం అన్నింటిలో ఫెయిల్ అయ్యిందని, దేశానికి అన్నం పెట్టే రైతుల చేతులతో కాళ్లు మొక్కించుకుంటున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.