24-08-2025 12:37:11 AM
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాం తి): రాష్ట్రంలో ప్రస్తుతం 42 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మరో 6,543 టన్నుల యూరియా రానున్నదని మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ నెల చివరి వరకు వివి ధ తేదీల్లో మరో 37,877 టన్నుల యూరి యా వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశా రు.
రాష్ట్రానికి యూరియా సరఫరాను పెం చేందుకు తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అన్ని రకాల చర్య లు తీసుకుంటుందని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురికావొద్దని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు విజ్ఞప్తి చేశారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్) యాజమాన్యం, వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో శనివా రం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలపై మంత్రులు ఆరా తీశారు. ఈ సీజన్‌లో 145 రోజల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆర్‌ఎఫ్‌సీఎల్ సీఈవో అలో క్ సింఘాల్‌ను ప్రశ్నించారు. మిమ్మల్ని కేవ లం వ్యాపారవేత్తలుగా మాత్రమే చూడటం లేదని, రాష్ట్రాభివృద్ధిలో తమతో కలిసి నడిచే భాగస్వామిగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ప్లాంట్ పునరుద్ధరణకు రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను సమీక్షించి మార్గని ర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణను చూడొద్దని సూచించారు. రామగుండంలో ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ఆర్‌ఎఫ్‌సీఎల్ మాతృ సంస్థ ఎన్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన ఇతర ప్లాంట్ల నుంచి తెలంగాణకు ప్రతిరోజు ఒక రేకు యూరియాను సరఫరా చేసేలా చొరవ చూపాలని కోరారు.
ముందుగా కనీసం 50 శాతం యూరియాను ఈ వారంలోనే రాష్ట్రానికి పంపేలా చూడాలని సూచించారు. ఈ విషయంలో సంస్థ వారికేమైనా ఇబ్బందులుంటే కేంద్రంతో మాట్లాడి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భరోసానిచ్చారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన 62,473 టన్నుల యూరియా అందలే దని ఆ సంస్థ ఎండీకి వెల్లడించారు. యూరి యా సరఫరా ఆలస్యమవ్వడంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, రైతుల పంటలపై ప్రతికూల ప్రభావం పడకముందే యూరియాను సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పందించిన ఆర్‌ఎఫ్‌సీఎల్ ఎండీ రాష్ట్రానికి కావాల్సిన యూరియాను త్వరలోనే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో స్పెషల్ సీఎ స్ సంజయ్‌కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆర్‌ఎఫ్‌సీఎల్ రామగుండం యూనిట్ హెడ్ జీఎం రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.