calender_icon.png 26 October, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవా కార్యక్రమాలకు పూర్తి మద్దతు

25-10-2025 11:38:22 PM

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్‌నగర్ (విజయక్రాంతి): పేద ప్రజల మేలు కోసం చేపట్టే కార్యక్రమాలకు తన సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం సనత్ నగర్ లోని ఆదిత్య నగర్ కమిటీ హాల్ లో శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో పలువురికి ఉచితంగా కళ్ళద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది పేదరికం కారణంగా ఆర్ధిక ఇబ్బందులతో సరైన వైద్యం పొందలేకపోతున్నారని చెప్పారు.

స్వచ్చంద సంస్థల ఆద్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిభిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. శ్రీ మాతా సేవా సమితి ధాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి పేదలకు అండగా నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, సేవా సమితి అధ్యక్షురాలు కుసుమ విజయ, నాయకులు రాజేష్ ముదిరాజ్, షాబాద్ శ్రీనివాస్, సమితి సభ్యులు రమాదేవి, శోభ, రాధిక, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.