calender_icon.png 26 October, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను ముంచుతున్న మిల్లర్స్

26-10-2025 12:00:00 AM

  1. సొసైటీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తిరిగి పంపిస్తున్న ఓ రైస్ మిల్లర్ 
  2. కామారెడ్డి జిల్లా బొమ్మన్‌దేవుపల్లిలో రైతుల రాస్తారోకో
  3. ధాన్యం కొనాలంటూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం
  4. ఎస్సై కాళ్లు మొక్కిన మరో రైతు

బాన్సువాడ, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియో జకవర్గంలోని బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల్లోని రైస్ మిల్లర్ల తీరును నిరసిస్తూ రైతులు శనివారం బొమ్మనిదేవుపల్లి చౌరస్తా వద్ద పెద్ద సంఖ్యలో రాస్తారోకో నిర్వహించారు. ఓ రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డాడు. మరో రైతు తమ కష్టాల్ని పట్టించుకోవాలంటూ స్థానిక ఎస్సై కాళ్లు పట్టుకొని వేడుకున్నారు.

రెండు గంటల పాటు జరిగిన ఆందోళనలో రైతులు తమ సమస్యలను వివరిస్తూ, రైస్ మిల్లర్ వ్యవహారాలు చేస్తున్న మోసాలపై ఆరోపించారు. అకాల వర్షానికి ఆరబెట్టుకున్న  ధా న్యం తడిసి ముద్ద కావడంతో కొనుగోలుకు మిల్లర్లు ససేమిరా అనడంతో రైతులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల మిల్లర్ వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరో పించారు.

ప్రభుత్వ నిబంధనలు మిల్లర్లు బేఖాతార్ చేస్తున్నారని తెలుస్తున్నది. కాగా ధాన్యం అమ్మకంలో రైతుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నస్రుల్లాబాద్ తహసీల్దార్ సువర్ణ చెప్పారు.