calender_icon.png 26 October, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 2న శ్రీచైతన్య స్కాలర్‌షిప్ టెస్ట్

26-10-2025 12:00:00 AM

  1. పదో తరగతి విద్యార్థులకు నిర్వహణ
  2. విద్యా సంస్థల అధినేత యం.రమేష్‌రెడ్డి
  3. స్కాలర్‌షిప్ టెస్ట్ పోస్టర్ల ఆవిష్కరణ

కరీంనగర్, అక్టోబరు 25 (విజయ క్రాంతి): పదోతరగతి విద్యార్థులకు నవంబర్ 2న శ్రీచైతన్య స్కాలర్ షిప్ పరీక్ష నిర్వహించనున్నట్లు శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత యం. రమేష్ రెడ్డి తెలిపారు. శనివారం స్కాలర్‌షిప్ టెస్ట్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఆధారంగా ఫీజు రాయితీ, మొదటి బహుమతి లాప్‌టాప్, 2 నుంచి 10వ ర్యాంకు వారికి టాబ్స్ బహుమతులు ఇవ్వనున్నట్లుతెలిపారు.

ప్రతిభ, ఆర్థిక స్థోమత సరిగా లేని పేద విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ మెయిన్స్, నీట్ ఎంసెట్ శిక్షణతో పాటు ఇంటర్ విద్యను కార్పొరేట్ స్థాయిలో అందించాలని మంచి ఉద్దేశ్యంతో తమ శ్రీచైతన్య విద్యాసంస్థ ద్వారా స్కాలర్ షిప్ టెస్ ను నిర్వహించుచున్నట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుందని, పరీక్షా కేంద్రాల వివరాలను నవంబర్ 1వ లేదా అంతకుముందే విద్యార్థులకు తెలియజేస్తామని తెలిపారు.

ఆసక్తిగల విద్యార్థులు https://forms. gle/rVc2mTjFDDwrdYna9లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 9848587584, 9912349038 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.  కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, జూనియర్ కళాశాలల డీన్ జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఎజియమ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.