calender_icon.png 6 September, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల భవన నిర్మాణానికి పూర్తి సహకారం -

06-09-2025 12:03:08 AM

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి , సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): వనపర్తి మున్సిపాలిటీ నాగవరం శివారులో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అన్ని వసతులతో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లాభవనం నిర్మాణం కోసం పూర్తి సహకారం అందిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు)వనపర్తి జిల్లా అధ్యక్షులు మాధవరావు ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

తంలో మార్కెట్ విలువ ప్రకారం సర్వేనెంబర్ 92/1లో 0.10 గుంటల భూమిని యూనియన్ భవనం కోసం కేటాయించగా, మార్కెట్ విలువ డబ్బు రూ. లక్ష ట్రెజరీలో జమ చేయడం జరిగిందన్నారు. స్థలాన్ని ప్రభుత్వం యూనియన్ కు స్వాధీనం కూడా చేసిందని, సంబంధిత పత్రాలను జర్నలిస్టులు ఆయనకు సమర్పించారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. భవనము నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని, అందుకు ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి సహకారం కూడా తీసుకుంటామని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులను మంజూరు చేయిస్తామన్నారు.

భవన నిర్మాణం కోసం అవసరమైన డిజైన్ ను జర్నలిస్టులు రూపొందించుకోవాలని సూచించారు. జర్నలిస్టులు యూనియన్ పక్షాన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.రాజు, యూనియన్ సీనియర్ నాయకులు ఉషన్న, మల్యాల బాలస్వామి, ప్రశాంత్, జిల్లా, కోశాధికారి మన్యం, ఉపాధ్యక్షులు కమాల్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఆంజనేయులు, నరసింహారాజు, నియోజకవర్గ అధ్యక్షుడు విజయ్ కుమార్, రవికాంత్, వేముల తిరుపతయ్య, యాకూబ్ , పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, సిలుమర్తి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.