06-09-2025 12:03:36 AM
ఆలేరు, సెప్టెంబర్ 5 (విజయక్రాం తి): వైద్యం వికటించిన ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం యాదాద్రి జిల్లా ఆలేరులో చోటుచేసుకుంది. పట్టణంలోని సుధా నర్సింగ్ హోమ్ డైరెక్టర్ డాక్టర్ ప్రతాపరెడ్డి హాస్పటల్‌కు ఉదయ్(28) వైద్యం కోసం వచ్చారు. ప్రతాపరెడ్డి చికిత్స అందిచగా, వైద్యం వికటించి ఉదయ్ హఠాత్తున మరణించడంతో కుటుంబీకులు ధర్నా కు దిగారు.
సీపీఐ ఎంఎల్ పార్టీ నాయకులు కల్లపు అడవయ్య, రాచకొండ జనార్దన్, బేజాడి కుమార్, ఇక్కిరి శ్రీను ధర్నాకు మద్దతు తెలిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్ ప్రతాపరెడ్డిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్‌చేశారు. యాదగిరిగుట్ట మండలం కారాచానికి చెందిన ఉదయ్ గుట్టలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు.