calender_icon.png 8 May, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్‌కు పూర్తి మద్దతు

08-05-2025 01:46:39 AM

పాక్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు పూర్తి మద్దతిస్తున్నాం.

 కాంగ్రెస్ నేత జైరాం రమేశ్

దేశం తీసుకున్న నిర్ణయంపై గర్వంగా ఉంది

ఈ రోజు నా దేశం తీసుకున్న నిర్ణయంపై గర్వంగా ఉంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమిళనాడు భారత సైన్యం వెంట నిలుస్తుంది. ఈ విషయంలో రాష్ట్రం దృఢ సంకల్పంతో ఉంది. జైహింద్.

ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి

భారత సైన్యానికి సెల్యూట్

పాకిస్థాన్‌లోని తీవ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించిన భారత సైన్యానికి సెల్యూట్. ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టే శక్తి మన సేనలకు ఉంది.

 కేటీఆర్

వంద పాక్‌లకు సమాధానం చెప్పే మిసైల్.. మోదీ

పహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయడం ఆనందంగా ఉంది. మన నేలపై మొలిచిన మొక్కను కూడా వాళ్లు పీకలేరు! వంద పాకిస్థాన్‌లకు సమాధానం చెప్పే మిసైల్ పేరు మోదీ.

 ఏపీ మంత్రి నారా లోకేశ్

మోదీ రియాక్షన్ చూపించారు

పహల్గాం ఉగ్రదాడిలో హిందువులను గుర్తించి మరీ చంపారు. వారికి ఆపరేషన్ సిందూర్ ఓ గుణపాఠం. ఉగ్రవాదులు ఓ బాధిత మహిళతో మోదీకి చెప్పుకో అన్నారు.. ఇప్పుడు మోదీ రియాక్షన్ చూపించారు. హిందూ మహిళల బొట్టు తీస్తే ఎలా ఉంటుందో చిన్న శాంపుల్ మాత్రమే.

ఎమ్మెల్యే రాజాసింగ్

సాయుధ దళాలకు అండ

భారత సైన్యం చర్యల పట్ల గర్వంగా ఉన్నాం. ఉగ్రవాదంపై పోరాటంలో దేశం మొత్తం సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది. 

 ఆప్ అధినేత కేజ్రీవాల్

భారత సైన్యానికి అభినందనలు

విజయవంతంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు భారత సైన్యానికి అభినందనలు. ఈ పోరాటంలో దేశం మొత్తం భారత సైన్యానికి మద్దతుగా ఉంది.  

 ఆతిశీ, ఢిల్లీ మాజీ సీఎం

న్యాయం జరిగింది

ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. పహల్గాంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరిగింది.

ఏక్‌నాథ్ శింషే, మహారాష్ట్ర మాజీ సీఎం

ఉగ్రవాదాన్ని రూపుమాపాలి

ఉగ్రవాదం మళ్లీ పుట్టకుండా భారత సైన్యం దాన్ని పూర్తిగా నిర్మూలించాలి. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ఉగ్రవాదాన్ని రూపుమాపాలి.

ఆదిత్య ఠాక్రే  శివసేన (యూబీటీ)

గర్వంగా ఉంది 

ఉగ్రవాదం.. వేర్పాటువాదం ఎప్పటికీ మనుగడలో ఉండకూడదు. నేడు మన భారత సైన్యం తీసుకున్న చర్యలు చూసి గర్విస్తున్నాం.

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

ఉగ్రవాదాన్ని సహించకూడదు

ప్రపంచం ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదు. ప్రతిపక్షాలు సైతం భారత సైన్యం చర్యలను కొనియాడుతున్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టినా తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నాయి.

 కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్

భారత సైన్యానికి మా మద్దతు

మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా. భారత సైన్యానికి మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. జైహింద్.

 కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

ఉగ్ర మూలాలను నాశనం చేయాలి

పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ బలగాలు జరిపిన దాడులను స్వాగతిస్తున్నాం. మరోసారి పహల్గాం తరహా ఘటన పునరావృతం కాకుండా ఉండేలా పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాలి. పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలి. జైహింద్

 ఎంఐఎం ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం

పహల్గాంలో అమాయక భారతీయులను చంపిన ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. దేశం మీద దాడి చేసిన వారికి తగిన బుద్ధిచెప్పడం భారత సాయుధ బలగాల ధైర్య సాహసాలకు నిదర్శనం. మనలను ఇబ్బంది పెట్టే వారికి తగిన గుణపాఠం చెప్తాం.  మన సైనికుల వీరత్వం ఎప్పటికీ గర్వకారణం.. జైహింద్. 

 కేంద్ర మంత్రి బండి సంజయ్

చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకు మోదీ పోరాటం

పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగ్గ విషయం. పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురుచూసింది. ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు దీటుగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయి. చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకు ప్రధాని మోదీ పోరాటం ఆగదు.

 పవన్‌కల్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం