calender_icon.png 25 September, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీడీఏలకు 15 కోట్ల చొప్పున నిధులు

25-09-2025 01:05:18 AM

మంత్రి సీతక్క హర్షం

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఏటూరునాగారం, ఉట్నూరు ఐటీడీఏల నూతన భవనాల నిర్మాణం కోసం రూ.15 కోట్ల చొప్పున నిధులు మం జూరు చేస్తూ జీవో జారీ చేయడం పట్ల మం త్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నప్పుడు ఐటీడీఏ ఉట్నూరు భవనం,

తన సొంత నియోజకవర్గంలోని ఏటూరు నాగారం ఐటీడీఏ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని గుర్తించి అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి మంత్రి సీతక్క తీసుకెళ్లగా సమస్యకు పరిష్కారం లభించింది.