25-09-2025 01:04:37 AM
ఎంపీ పోరిక బలరాం నాయక్
మహబూబాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): పేదల వైద్య ఖర్చులు భారంగా మారిన నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) దోహదపడుతోందని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. జిల్లా కేంద్రం లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 105 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన 40.5లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ను చిన్న భిన్నం చేసినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందని చెప్పారు. నిరుపేదలకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అండగా నిలబడుతుందన్నారు. ప్రజలు అన్ని విధా లుగా బాగున్నప్పుడే రాష్ట్రం ముందుకు సాగుతుందని, ఆ దిశగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఎదల్ల యాదవ రెడ్డి, హెచ్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.