calender_icon.png 25 September, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు ప్రత్యేక ఇంటర్ కాలేజీలు

25-09-2025 01:05:23 AM

ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): దివ్యాంగులకు ప్రత్యేక ప్రభుత్వ జూనియర్ కాలేజలను ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి ఇవి అందు బాటులో తేనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడా రు.  అధ్యాపకుల కొరత ఉన్న చోట 494 గెస్ట్ లెక్చరర్లను తీసుకోనున్నట్లు తెలిపారు.

కొత్తగా ఏర్పాటైన జూనియర్ కాలేజీల్లో ఇంకా పోస్టులు మంజూరు కాలేదని తెలిపారు. ఈనెల 26న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఏర్పా  చేసిన కమా ండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు హాజరును మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు.  ప్రైవేట్ కాలేజీల్లోని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ఈసారి కూడా జంబ్లింగ్ విధానం ఉండదని ఆయన పేర్కొన్నారు.