calender_icon.png 23 August, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలిమెల మండల పరిషత్ కార్యాలయానికి రూ. 1.50 లక్షలు మంజూరు

23-08-2025 07:01:01 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండల కేంద్రానికి మండల పరిషత్ కార్యాలయం నూతనంగా నిర్మించుట కు రూ.1.50 లక్షలు నిధులను మంజూరు చేసినట్లు శనివారం మాజీ ఎంపీపీ కురుసం బుచ్చక్క తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) చోరవతో మారుమూల మండలమైన పలిమెల మండల అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తూ ఆ కృషిలో భాగంగా ఒక కోటి 50 లక్షల రూపాయలతో నూతన మండల పరిషత్ కార్యాలయాన్ని నిర్మించుటకు నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు మాజీ ఎంపీపీ బుచ్చక్క, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్మోహన రావు కృతజ్ఞతలు తెలిపారు.