23-08-2025 06:59:53 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): రైతులు, వరి పొలం చిరు పొట్ట దశలో యూరియాతో పాటు పోటాష్ ఎరువులను కూడా తప్పనిసరిగా అజామాబాదు రైతు వేదికలో వరిలో తెగులు, పురుగుల యాజమాన్యంపైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, మల్తూ మ్మెద శాస్త్రవెత్తలు డా, ఏ అనిల్ రెడ్డి కో ఆర్డినేటర్ మాట్లాడుతూ... వరిలో కాండం తోలుచు పురుగు ఆకు చుట్టూ పురుగులను గుర్తించిన వెంటనే కార్టాఫ్ హైడ్రో క్లోరైడ్ రెండు గ్రాములు లీటర్ నీటికి లేదా క్లోరంత్ర నీలి ప్రోల్ 0.4 మిల్లిలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచకారీ చేయాలని రైతులకు వివరించారు.
శాస్త్రవెత్త డా, జెకె, రేవంత్ నాథన్ శాస్త్రవెత్త (వెధ్య విభాగం) మాట్లాడుతూ యూరియాను మూడు లేదా నాలుగు దాఫాలుగా వాడుకోవాలని అదేవిదంగా వరి పొలం చిరు పొట్ట దశలో యూరియాతో పాటు పోటాష్ ఎరువులను కూడా తప్పనిసరిగా వాడుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏడిఏ సుధా మాధురి ఏవో మహమ్మద్ నదిముద్దీన్ ఏఈవో రాజా గౌడ్ తో పాటు రైతులు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. తరువాత రైతులతో పాటువరి పొలం క్షేత్ర సందర్శన తోపాటు వరి పొలంలో గల సమస్యలను పరిశీలించి రైతులకు పలు సూచన సలహాలు అందజేశారు.