calender_icon.png 3 November, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఇన్చార్జిగా విజ్ఞతేజ..

02-11-2025 10:08:50 PM

నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): ఆర్యవైశ్య కార్పొరేషన్ నిర్మల్ జిల్లా ఇంచార్జిగా పత్తి విజ్ఞతేజ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఆదివారం నిర్మల్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రకటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆర్యవైశ్యులకు అందేలా చూడాలని ఈ సందర్భంగా చైర్మన్ సుజాత సూచించారు. తనపై ఎంతో నమ్మకంతో జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన చైర్మన్ సుజాతకు విజ్ఞతేజ కృతజ్ఞతలు తెలిపారు.