17-11-2025 12:00:00 AM
నిర్మల్ నవంబర్ 16(విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలో రహదారుల అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరిని మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందించారు.
ఈ భేటీలో మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో రహదారుల అభివృద్ధి అంశంపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు.
అదేవిధంగా నియోజకవర్గంలో పలు సమస్యలపై సైతం మంత్రి గారితో చర్చించడం జరిగిందని అన్నారు. రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు విషయంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగిందని, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.