calender_icon.png 17 November, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో అద్భుత అవకాశం

17-11-2025 12:00:00 AM

కొల్చారం, నవంబర్ 16 :కొల్చారం మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆదివారం పదవ తరగతి లో 38 మంది, ఇంటర్మీడియట్లో 45 మంది తరగతికి హాజరయ్యారు.

వారికి ఉపాధ్యాయులు ఆర్ శ్రీధర్ రెడ్డి, ఓం ప్రకాష్ పుస్తకాలను పంపిణీ చేశారు. చదువు మధ్యలో ఆపివేసిన వారికి ఓపెన్ టెన్త్, ఇంటర్ మంచి అవకాశం అని. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.