calender_icon.png 11 May, 2025 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిడ్ క్యాప్‌కు నిధులు కేటాయించాలి

10-05-2025 12:00:00 AM

మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్

మందమర్రి, మే9: పట్టణంలో 2007లో ప్రారంభించిన లీడ్ క్యాప్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులు కేటాయించి ఉత్పత్తులు ప్రారంభించాలని మాది హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని పాలచెట్టు సమీపంలో ఏర్పాటు చేసిన లీడ్ క్యాప్ భవనాన్ని, భూములను శుక్రవారం ఆయన పరి శీలించి మాట్లాడారు. లిడ్ క్యాప్ సాధనకు మాదిగ హక్కుల దండోరా సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్మకారుల అభివృద్ధి కోసం పట్టణంలో 25 ఎకరాలలో భూమిని  కేటాయించినప్పటికీ అది కేటాయింపు గానే మిగిలి పోయింది తప్ప ఉత్పత్తులు ప్రారంభించకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ప్రారంభించేలా చర్య లు చేపట్టి పట్టణ ప్రజలకు ఉపాధి కల్పించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం తన వాటా 80 శాతం నిధులను వెంటనే కేటాయించి నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాది గ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం ట్ చిలుక రాజనర్సు మాదిగ, లెదర్ ఇండస్ట్రీస్ పార్క్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పోత్తూరి రమేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతే స్వామి, కొలుగురి విజయ్ కుమార్,

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్లూరి లక్ష్మణ్, సంగి సంతోష్, డి కనకయ్య, నందిపేట రవి, బచ్చలి నరసయ్య, చిలుముల కుమార్, అసంపల్లి రాయమల్లు, సుద్దాల జనార్ధన్, మంతెన సుమన్, బత్తుల సరిత, బొడ్డు వినోద, తోకల నిరోష, కాంపల్లి లక్ష్మి, మామిడిపెళ్లి ప్రకాష్, శివ, వేల్పుల కిరణ్, కొలు గూరి పృథ్వీరాజ్  పాల్గొన్నారు