calender_icon.png 11 May, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా అందాలపోటీలు!

11-05-2025 02:00:47 AM

  1. పోటీలను ఆరంభిస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి
  2. ప్రపంచ శాంతికి, ఐక్యతకు ఈ పోటీలు పాటుపడతాయన్న నిర్వాహకులు
  3. మిస్ ఇండియా నందినిగుప్తా ర్యాంపుపైకి రాగానే దద్దరిల్లిన స్టేడియం
  4. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని కోరిన ప్రభుత్వం 
  5. మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీపడుతున్న 110 దేశాల సుందరీమణులు

హైదరాబాద్, మే 10(విజయక్రాంతి): 72వ మిస్ వరల్డ్ పోటీలు శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ఆరంభమయ్యాయి. వేడుకలు ప్రారంభమయ్యా యని సీఎం రేవంత్‌రెడ్డి, మిస్‌వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ ప్రకటించారు. పోటీదారుల మిస్‌వరల్డ్ గీతాలాపనతో అధికారికంగా ఈ పోటీలు మొదలయ్యా యి. అంతకుముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా, విదేశీ పోటీదారులు తమ దేశ సంస్కృతీ, సంప్రదాయాలకు అనుగుణంగా ధరించిన ఆహార్యాలతో ర్యాంపు పైకి వచ్చి ఆకట్టుకున్నారు.

అందెశ్రీ రచించిన జయజ యహే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో వేడుకలు మొదలయ్యాయి. గీతాన్ని 50 మంది గాయకులు ఆలపించారు. వేడుకలు ఆద్యంతం తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు,  కళాప్రదర్శనలు, పాశ్చాత్య కళల మేళవింపుగా కనులపండువగా జరిగాయి. కళాప్రదర్శనలో మొదటగా 250మంది కళాకారులు చేసి న పేరిణీ నృత్యప్రదర్శన ఆహుతులను అలరించింది. కొమ్ముకోయ, గుస్సాడీ, లంబాడీ, సంప్రదాయ నృత్యాలు, ఒగ్గుడోలు కళా ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నాయి.

ఈ ప్రదర్శనలు విదేశీ అతిథులను అలరించాయి. ప్రధానంగా లంబాడా కళాకారుల డప్పు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.  ప్రపంచంలోనే ఒకటై న పురాతన కళగా నిర్వాహకులు ప్రకటించారు. మొదటి రౌండులో లాటిన్ అమె రికా, కరేబియన్ దేశాల పోటీదారులు ర్యాంపు పైకి నడుచుకుంటూ వచ్చారు. వీరిలో అర్జెంటీనా కంటెస్టెంట్  మొదటగా ర్యాంప్‌పైకి వచ్చారు.  వీరు తమ దేశ సంస్కృతి, సంప్రదాయాల దుస్తులతో వచ్చి అలరించారు. వీరి తర్వాత రెండో రౌండులో ఆఫ్రికన్ దేశాల నుంచి 22 మంది పోటీదారులు తమ దేశ సంస్కృతి, వేషధారణతో ఆకట్టుకున్నారు.

వీరిలో అంగోలా దేశానికి చెందిన కంటెస్టెంట్  మొదట ర్యాం పు పైకి వచ్చారు. మూడో రౌండ్‌లో యూర ప్ ఖండం నుంచి పోటీదారులు ర్యాంపు పైకి రాగా, అల్బేనియా దేశం కంటెస్టెంట్ మొదటగా వేదికపైకి వచ్చారు. యూరప్ నుంచి 33 దేశాల పోటీదారులు వచ్చారు. వారి సంస్కృతీ సంప్రదాయాలను ప్రదర్శించారు. చివరి రౌండు కంటెస్టెంట్స్ ఆసియా ఓషియానియా నుంచి ర్యాంపు పైకి వచ్చారు. మొత్తం 22 దేశాల నుంచి పోటీదారులు వచ్చారు. తమ సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించారు. 

ముఖ్యంగా మనదేశం నుం చి ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా నందినిగుప్తా వచ్చినప్పుడు స్టేడియం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. ఇక చీరకట్టుతో వచ్చిన మిస్ నేపాలీ అందరినీ ఆకట్టుకున్నది. పోటీదారుల్లో అందరికంటే చివరగా ర్యాంపు పైకి వచ్చిన మిస్ వియ త్నాం తనదైన నృత్యంతో అందరినీ ఆకట్టుకుంది. దీంతోపాటు తమ తమ జాతీయ జెండాలను పట్టుకొని 110 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు మిస్ ఇండియా నందినిగుప్తా ర్యాంపు పైకి వచ్చారు.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు 116 దేశాల నుంచి అందగత్తెలు తరలివచ్చారు. తెలంగాణ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కళాప్రదర్శనలను, ప్రారంభ ఉత్సవాలను లాంఛనంగా ఆరంభించారు. కాగా ప్రపంచ శాంతికి చక్క టి మెసేజ్‌ను ఇచ్చామని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని కంటెస్టెంట్స్‌ను ఆయన కోరారు.

ప్రారంభోత్సవ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, సం ప్రదాయాలు ఉట్టిపడేలా ప్రభుత్వం ఏర్పా ట్లు చేసింది. ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదంతో ఈవెంట్‌ను ముగించారు. కార్యక్ర మంలో సీఎస్ రామకృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా ప్రిజ్కోవా తదితరులు పాల్గొన్నారు.