calender_icon.png 11 May, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ పచ్చిమోసం

11-05-2025 02:07:19 AM

కాల్పుల విరమణ అని 3 గంటల్లోనే తూట్లు

సరిహద్దు నగరాలపై తెగబడ్డ పాక్

దాడులను తిప్పికొట్టిన భారత్

  1. రాయబారం నడిపి.. కాల్పులకు తెగబడ్డ దాయాది
  2. కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులు.. తిప్పికొట్టిన భారత సైన్యం
  3. శ్రీనగర్ అంతటా పేలుళ్ల మోత..సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాకౌట్
  4. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందన్న విదేశాంగ శాఖ కార్యదర్శి
  5. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం: విక్రమ్ మిస్రీ
  6. కాల్పుల విరమణ జరగలేదన్న జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా
  7. కాల్పుల విరమణ ఒప్పందంతోనే పాక్‌కు ఐఎంఎఫ్ రుణం?
  8. పాక్ ప్రధాని ఆదేశాలు ఖాతరు చేయని ఆర్మీ!
  9. పాక్‌లో మరోసారి సైనిక తిరుగుబాటు తప్పదా?

న్యూఢిల్లీ, మే 10: సరిహద్దుల్లో కొద్ది రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలకు శనివారం తెరపడినట్టే పడి పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమ ణకు అంగీకరించినట్టు శనివారం సాయం త్రం ట్రంప్ వెల్లడించారు. సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ ఒప్పం దం అమల్లోకి వచ్చినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా పేర్కొన్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పం దానికి తూట్లు పొడుస్తూ శనివారం రాత్రి పాకిస్థాన్ మళ్లీ కాల్పులకు దిగింది.

సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడు లు చేసి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఉదాంపూర్ సెక్టార్లో మొదట డ్రోన్ దాడులు చేసిన పాక్ అనంతరం సరిహద్దు ప్రాంతాలపై విరుచుకుపడింది. శ్రీనగర్, బరంపూర్, జైసల్మేర్, పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్, హరామి నాలా, ఖద్వా, కచ్, తదితర ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడింది. ఈ దాడులను ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. గుజరాత్‌లోని కచ్‌లో పాక్ డ్రోన్ కనిపించినట్టు గుజరాత్ హోంమంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశా రు.

గుజరాత్‌లోని భుజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో బ్లాకౌట్ విధించారు. ఈ పేలు ళ్లు, డ్రోన్ దాడుల గురించి విదేశాంగ శాఖ విక్రమ్ మిస్రీ స్పందిస్తూ.. దాడులు నిజమే అని వెల్లడించారు. దీనిపై భారత్ చాలా సీరియస్‌గా ఉందని తెలిపా రు. సరిహద్దు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలతో కేంద్ర హోంశాఖ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 

మళ్లీ చీకట్లు

పాకిస్థాన్ డ్రోన్ దాడులతో పలు ప్రాం తాల్లో బ్లాకౌట్ విధించారు. జమ్మూ, శ్రీనగర్, కథువా, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోఠ్, ఫజిల్కా, అంబాలా, పటియాలా, జైసల్మేర్, బార్మర్ ప్రాంతాల్లో బ్లాకౌట్ విధించారు. శ్రీనగర్‌లో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపిస్తున్నాయని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అసలు ఇది కాల్పులు విరమణ ఒప్పందమే కాదన్నారు. జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా సరిహ ద్దు వద్ద పలువురు చొరబాటుకు యత్నించారు. చొరబాటుదారులతో జరిపిన కాల్పుల్లో ఓ సెంట్రీకి గాయాలయినట్టు తెలుస్తోంది. పలు పాంతాల్లో సైరన్లు మోగాయి. దీంతో ప్రజలు వెంటనే అలర్ట్ అయ్యారు. 

ఉల్లంఘన నిజమే.. 

పాకిస్థాన్ డ్రోన్ దాడులతో సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్ విధించారు. ఈ పరిస్థితిపై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశం నిర్వహించారు. ‘సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. డీజీఎంవోల మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘిం చడాన్ని ఖండిస్తున్నాం. ఒప్పంద ఉల్లంఘన అత్యంత దుర్మార్గ చర్య. గత కొద్ది గంటల నుంచి పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది.

కాల్పులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది.ఆర్మీకి అవసరం అయిన ఆదేశాలు ఇచ్చాం. పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఆర్మీ పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా పాక్ చర్యలు తీసుకోవాలి. ఈ ఉల్లంఘనలను భారత్ సీరియస్‌గా తీసుకుంటుంది.’ అని మిస్రీ తెలిపారు. 

భారత నిబంధనల మేరకే..

కాల్పుల విరమణ భారత సొంత నిబంధనల మేరకే కుదిరిందని ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. భారత్ తన సొంత నిబంధనల మేరకే పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించిందని పలువురు పేర్కొన్నారు. పాకిస్థాన్ జాతీయ సలహాదారు అసిమ్ మాలిక్ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో దేశం పాత్ర లేదని తెలుస్తోంది. పాకిస్థాన్ డీజీఎంవో, భారత డీజీఎంవోకు ఫోన్ చేసి కాల్పుల విరమణ కోసం అభ్యర్థించారు. విదేశాంగ శాఖ సెక్రటరీ మిస్రీ కూడా ఇదే విషయం వెల్లడించారు.  

ఇరు దేశాలు ఒప్పుకున్నాయి: పాక్ ఉపప్రధాని

కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయని పాక్ ఉపప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. ఆయన కాల్పుల విరమణపై ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘శాంతి, భద్రత కోసం మా ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. తక్షణమే భారత్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. దేశసమగ్రత విషయంలో మా ప్రభుత్వం రాజీపడదు’ అని పేర్కొన్నారు. 

ఉగ్రవాదంపై రాజీ పడే ప్రసక్తే లేదు: జైశంకర్

భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడంపై రెండు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం విషయంలో భారత్ ఇప్పటి వరకు రాజీలేని పోరాటం కొనసాగించింది. ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియోతో చర్చలు జరిపినట్టు జైశంకర్ వెల్లడించారు.

భారత్-పాకిస్థాన్ మధ్యే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వం గురించి జైశంకర్ కూడా ప్రకటించకపోవడం గమనార్హం. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘గత 48 గంటలుగా ఉపాధ్యక్షుడు వాన్స్, నేను భారత్, పాక్‌కు చెందిన సీనియర్ నేతలతో చర్చలు జరిపాం’. అని పేర్కొన్నారు. 

కాల్పుల విరమణ షరతుతోనే ఐఎంఎఫ్ రుణం?

పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి రుణం మంజూరయిన విషయం తెలిసందే. ఈ రుణం మంజూరు చేసేందుకు భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకో వాలని ఐఎంఎఫ్ పాకిస్థాన్‌కు షరతు విధించిందా? అని అందరిలో అనుమానం కలుగుతోంది. 1 బిలియన్ అమెరికన్ డాలర్లను మంజూరు చేసిన ఐఎంఎ ఫ్ పాకిస్థాన్‌కు ఇదే షరతు విధించినట్టు తెలుస్తోంది.

దీంతోనే రుణం మంజూరయిన 24 గంటల్లోపే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిం చిందని చర్చించుకుంటున్నారు. ఐఎంఎఫ్ ఈ రుణం ఇచ్చేందుకు భారత్ అభ్యంతరం తెలిపింది. భారత్‌తో కాల్పుల విరమణకు అంగీకరిస్తేనే ఈ రుణం మంజూ రు అవుతుందని అమెరికా పాకిస్థాన్ మీద ఒత్తిడి చేసినట్టు సమాచారం. అమెరికా అనుమతి లేనిదే ఏ ఒక్క దేశానికి కూడా ఐఎంఎఫ్ రుణం మంజూరు చేయదు. 

పాక్ అంటేనే కన్ఫ్యూజన్.. మరో సైనిక తిరుగుబాటు తప్పదా! 

పాకిస్థాన్ అంటేనే కన్ఫ్యూజన్. సైనిక తిరుగుబాట్లు, మిలటరీ ప్రభుత్వాలు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ప్రకటన చేసినా కానీ ఆ దేశ మిలటరీ పెద్దగా పట్టించుకోలేదు. డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతూ షరీఫ్ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే పాక్ సైన్యం భారత్‌పై దాడులకు తెగబడింది. పాక్‌లో మిలటరీ ప్రభుత్వాలు, అక్కడి మిలటరీ అధికారుల అరాచకాలు కొత్తేం కాదు. ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ను గద్దెదించి షెహబాజ్‌కు ప్రధాని పదవి కట్టబెట్టడంలో ఆర్మీ చీఫ్ మునీర్ ముఖ్యభూమిక పోషించారు. ఇప్పటికే పాక్‌లో మూడు సార్లు సైనిక తిరుగుబాట్లు జరిగాయి.

అమెరికా మధ్యవర్తిత్వం ఏం లేదు!

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ అంగీకారం కుదిరినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేరుగానే జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పాకిస్థాన్‌తో మరో దఫా చర్చలు జరుగుతాయి’ అని తెలిపారు. ఆయన తన ప్రసంగంలో అమెరికా మధ్యవర్తిత్వం గురించి ఏమీ చెప్పకపోవడం గమనార్హం.

‘పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) శనివారం మధ్యాహ్నం 3.35కు భారత డీజీఎంవోకు  ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రెండు దేశాలు అన్ని రకాల దాడులు (భూ, గగన, సముద్ర తలాల) ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇరు దేశాల సైనికులకు ఆదేశాలు వెళ్లాయి.’ అని పేర్కొన్నారు.  

అమెరికా మధ్యవర్తిత్వం

ఇరుదేశాలకు అభినందనలు

అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రం తా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్, పాకిస్థాన్ అంగీకరించాయి. ఈ కాల్పు ల విరమణ తక్షణ మే, సంపూర్ణంగా అమల్లోకి వస్తుంది. సరైన సమయంలో ఇరుదేశాలు విజ్ఞతతో వ్యవహరించా యి. అందుకు రెండు దేశాలకు అభినందనలు. భారత్, పాక్ ప్రధానులు, విదేశాంగ మంత్రి జైశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో నేను, ఉపాధ్యక్షుడు వాన్స్ మాట్లాడాము. 

 ఎక్స్‌లో అమెరికా అధ్యక్షుడుట్రంప్