18-10-2025 02:42:08 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్(Telangana BC Bandh) కొనసాగుతోంది. బీసీ సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, ఆమన్ గల్ లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పార్టీ నాయకులు,శ్రేణులతో కలిసి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ వద్ద జరిగిన బీసీ బంద్‌లో టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్(TPCC Chief B. Mahesh Kumar), మంద కృష్ణ మాదిగతో కలిసి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని వెనుకబడిన తరగతుల (బీసీ) యువత రిజర్వేషన్లలో తమకు రావాల్సిన వాటాను డిమాండ్ చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి శుక్రవారం ఖైరతాబాద్ జంక్షన్‌లో మానవహారం నిర్వహించింది. జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర జరిగిన బీసీ బంద్‌లో పాల్గొన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.