calender_icon.png 18 October, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో బీసీ బంద్ ప్రశాంతం

18-10-2025 02:16:52 PM

ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, బిజెపి పార్టీలు

తుంగతుర్తి,(విజయ క్రాంతి): బీసీ బందు లో బిజెపి పార్టీ పాల్గొనడం, సిగ్గుచేటని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సిపిఎం మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్  విమర్శించారు. శనివారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ తో బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు మద్దతుగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు, భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు కలిసికట్టుగా బందులో పాల్గొని ర్యాలీ నిర్వహించి విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా  వామపక్ష నాయకులు మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీపై విరుచుకుపడ్డారు. రిజర్వేషన్ల అమలును అడ్డుకున్నదే బీజేపీ అని, ఇప్పుడు అదే పార్టీ బంద్‌లో పాల్గొంటూ, డ్రామాలు ఆడుతోందని వారు విమర్శించారు.తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో పూర్తి చిత్తశుద్ధితో ఉందని చింతకుంట్ల వెంకన్న స్పష్టం చేశారు. "సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చట్ట సభల్లో బిల్లును ఆమోదించి, ఆర్డినెన్స్ కూడా జారీ చేసినట్లు తెలిపారు.గవర్నర్ ఒక్క సంతకం పెట్టి ఉంటే ఈ సమస్యే ఉండేది కాదు. కానీ, బిల్లును ఆపాలనే కుట్రతోనే దానిని కేంద్రానికి పంపారని బుర్ర శ్రీనివాస్ ఆరోపించారు.ఒకవైపు చట్టపరంగా అడ్డంకులు సృష్టిస్తూ, మరోవైపు ఇప్పుడు బీసీల కోసం చేపట్టిన బంద్‌లో పాల్గొనడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వారు విమర్శించారు.

ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు  తిరుమల ప్రగడ కిషన్ రావు, పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు యాదవ్, సంవిధాన్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్, కొండ రాజు,కటకం వెంకటేశ్వర్లు, ముత్యాల వెంకటేశ్వర్లు, జలంధర్, వీరబోయిన రాముల యాదవ్, కటకం వెంకటేశ్వర్లు ,సూదగాని రాజయ్య, అబ్బ గాని సత్యనారాయణ,సిపిఎం నాయకులు ఓరుగంటి అంతయ్య, ఉప్పల సోమయ్య, గడ్డం ఎల్లయ్య, మడిపెద్ది యాదగిరి,సిపిఐ నాయకులు రాజారాం, కోట రామస్వామి, సి పి యూఎస్ ఐ మట్టపల్లి లింగయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు తడకమల్ల నాగమల్లు, బిజెపి మండల నాయకులు నారాయణదాసు నాగరాజు, తడకమల సుధాకర్, కత్తుల నరేష్, పులి పంపుల సైదులు గౌడ్, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. తుంగతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.