17 August, 2026 | 5:15 PM

సెప్టెంబర్ 2న పూరి జగన్నాథ్ బస్సు సదుపాయం

17-08-2026 04:11 PM

నిర్మల్ ఆగస్టు 17 (విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి సెప్టెంబర్ 2వ తేదిన పూరిజగన్నాథ్ యాత్ర స్పెషల్ సూపర్ లగ్జరి బస్సు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. ఈ బస్సు సెప్టెంబర్ 2న నిర్మల్ నుండి బయలుదేరి అన్నవరం సత్యనారయణ స్వామీ ఆలయం అర్సవెల్లి సూర్యనారాయణ టెంపుల్, సింహాచలం అప్పన్న శ్రీ కూర్మం, కోణార్క్ సన్ టెంపుల్, పూరి జగన్నాథ్ ఆలయం, విశాఖపట్నం, ద్వారక తిరుమల పుణ్యక్షేత్రములు వెళ్తుందన్నారు.

తిరిగి సెప్టెంబర్ 7న నిర్మల్ చేరుకొనును. ఛార్జి ఒకరికి 6400/- రూ!!లు ఉంటుందని 6 రోజుల యాత్ర ఉంటుందని భోజన వసతి ఖర్చులు ప్రయాణికులే భరించుకోవాలని డిపోమేనేజర్ తెలిపారు. కార్తీక మాసంలో పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని, ఆసక్తి కలవారు మీ మొబైల్ ఫోన్ లో కాని లేదా మన నిర్మల్ బస్టాండ్ లో గల రిజర్వేషన్ కౌంటర్ లో గాని ముందుగా సీట్లు బుక్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9959226003, లేదా 7382842582, లో  సంప్రదించాలని ఆయన తెలిపారు.