18-12-2024 01:10:31 PM
బ్రిస్బేన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టును డ్రాగా ముగించింది. రెండో ఇన్నింగ్స్ ఆసీస్ జట్టు 89 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడానికి ముందు ఆస్ట్రేలియా ఏడు వికెట్ల కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 275 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రన్ ఛేజింగ్ కు దిగిన భారత్ వికెట్ నష్టపోయకుండా (8) పరుగుల స్కోర్ ఉన్నప్పుడు వాన పడింది. వర్షం తగ్గకపోవడంతో మ్యాచును ముగిస్తున్నట్లు అంపైర్లు వెల్లడించారు. దీంతో గబ్బా టెస్టు డ్రాగా ముగిసింది. ఐదు టెస్టుల సిరీస్ లో చెరొక విజయంతో సిరీస్ 1-1తో సమం అయింది. నాలుగో టెట్లు మ్యాచు మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది.