calender_icon.png 7 August, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జాగృతి ఆవిర్భావ వేడుకలు

06-08-2025 10:45:27 PM

కొత్తకోట: తెలంగాణ జాగృతి ఆవిర్భావ వేడుకలు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి రోజున హైదరాబాద్ లో జాగృతి వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆధ్వర్యంలో జాగృతి నాయకులు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి జెండాను ఎగురవేశారు. అనంతరం జయంశంకర్ సార్ జయంతి సందర్బంగా అయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. త్వరలో జాగృతి కమిటీలు ప్రకటనలు చేస్తామని కవిత చెప్పినట్లు జాగృతి నాయకులు దాసరి విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశపాగ ఎలస్వామి, పాషా, రవి, తదితరులు పాల్గొన్నారు.