22-09-2025 05:37:45 PM
కుమారి అలంకారంలో దర్శనమిచ్చిన గజ్వేల్ మహంకాళి
గజ్వేల్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని విద్యాధరక్షేత్రంలో విద్యా సరస్వతి బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారికి చతు షష్టి ఉపచార పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు.
గజ్వేల్ పట్టణంలోని మహంకాళి ఆలయంలో అమ్మవారు మొదటి రోజు 108 చీరలతో కుమారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ చైర్మన్ కాల్వ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో భక్తులకు నిత్య అన్నదాన ఏర్పాటు చేయగా, ప్రధాన అర్చకులు చాడ నంద బాలశర్మ తో పాటు చంద్రశేఖర శర్మ ల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, చతుర్ షష్టి ఉపచార పూజలు, సామూహిక కుంకుమార్చన లు, చండీ హవనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే గజ్వేల్ సంతోషిమాత బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది.