08-09-2025 01:06:22 AM
కేసీఆర్ హయాంలో జర్నలిస్టులకు ఇండ్లు
వాట్సాప్, యూట్యూబ్‌లతో జర్నలిస్టులకు కత్తిమీద సామే
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
ఘనంగా గజ్వెల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవ వేడుకలు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
గజ్వేల్, సెప్టెంబర్ 7: గజ్వేల్ ప్రెస్ క్లబ్ పీపుల్స్ ప్రెస్ క్లబ్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివా రం సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ఎస్‌ఏల్‌ఏన్ కన్వెన్షన్ హాల్ లో గజ్వేల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవ వేడుకలు ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరై మాట్లాడుతూ..
తెలంగాణ ఉ ద్యమంలో ప్రజలను, అన్ని రాజకీయ పార్టీ ల నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమంలో కీలకపాత్ర పోషించే విధంగా కృషి చెయ్యడంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ధూంధాం పేరిట అ న్ని రాజకీయ పార్టీల నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు మెతుకు సీ మలో రైతులు ఆత్మహత్యల నివారణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో జర్నలిస్టుల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లతో పాటు, గ్రామీణ ప్రాంత విలేకరులకు బస్సు పాసులు అందించారని, జర్నలిస్టుల కోసం వంద కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారన్నారు. రిటైర్డ్ జర్నలిస్టుల కోసం ఈహెచ్‌ఏస్ ఏర్పాటుకు అసెం బ్లీలో చర్చిస్తామని చెప్పారు.
తెలంగాణ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భావాలను తెలిపే దే విలేకరులని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమ లు పరిచేది న్యాయవ్యవస్థ, పత్రిక వ్యవస్థ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో గజ్వేల్ ప్రెస్ క్లబ్ కు ప్రత్యేక పేరు ప్రతిష్ఠలు ఉన్నాయని, గజ్వేల్ జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలికితీసి చైతన్యానికి మేలితం చేశా రని, ఎన్నో సామాజిక కార్యక్రమాలకు పురు డు పోశారని గుర్తు చేశారు.
హైదరాబాదు లో జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి సెం ట్రల్ జైలుకు పంపితే ఆ సమయంలో జర్నలిస్టుల పక్షాన బషీర్ బాగ్ లో విధులను బ హిష్కరించడం జరిగిందన్నారు. హైదరాబాదులో గతంలో పనిచేసిన మాజీ సీఎం హ యాంలో జర్నలిస్టులకు 150ఎకరాలకు పై గా ఇంటిస్థలాలకోసం భూములు ఇచ్చారని తెలిపారు. కాగా ప్రస్తుతం సమస్యగా మారిందని, సుప్రీం కోర్టు వెళ్లారని చెప్పారు.
వ్యవ స్థలన్నీ సవరించినప్పుడే న్యాయం జరుగుతుందని తెలిపారు.వారం రోజులలో రాష్ట్రం లోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అ వుతాయని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జర్న లిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరగా సంబంధిత శాఖ అధికారులను పిలిపించి వారం రోజులలోపు సమావేశం ఏర్పాటు చే సి జర్నలిస్టుల సమస్యలు వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సమా వేశం పూర్తి కాగానే జీవో విడుదల చేసే వి ధంగా రూపకల్పన చేసుకొని రావాలని సీఎం అధికారులకు అదేశించారని ఆయన తెలిపారు.
గతంలో జర్నలిస్టులు అంటే అపా ర గౌరవం ఉండేదని గ్రామాల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా జర్నలిస్టుల దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్య వేగంగా పరిష్కారమయ్యేదని నమ్మకం ఉండేది కానీ పుట్టగొడుగుల్లా వందల్లో యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడి యా రావడంతో నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు గౌరవం దక్కడం లేదని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
మీడియా అకాడమీ ద్వారా విలువల్లేని జర్నలిస్టులను పక్కన పెట్టేందుకు వెనుకాడ వద్ద ని సూచించారు. నేడు పల్లెల్లో డ్రగ్స్ మహమ్మారి పెచ్చు మీరుతోందని కళాశాలలో, పాఠశాలల్లో చిన్నారులు డ్రగ్స్ బారిన పడుతున్నారని, గజ్వేల్ జర్నలిస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై పోరాటం చేయాలని సూచించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ప్రెస్ క్లబ్ లు ఉన్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ కి ప్రత్యేక గు ర్తింపు ఉందన్నారు.
ప్రత్యక్షంగా ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసి, ప్ర జా ఉద్యమంలో భాగస్వామ్యమైన ఏకైక ప్రె స్ క్లబ్ గజ్వేల్ ప్రెస్ క్లబ్ అని అన్నారు. గ జ్వేల్ ప్రెస్ క్లబ్ ను సేద తీరేందుకు ఉపయోగించుకోలేదని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేందుకు ఒక వేదికగా అప్పట్లో సీనియర్ జర్నలిస్టులు అందరూ ఉపయోగించు కున్నామన్నారు. కల్తీకల్లు, నిరక్షరాస్యత ని ర్మూలన, బాల్యవివాహాలు, కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ఎన్నో పోరాటాలు చేసామన్నా రు.
నాటీ ఎన్నో ప్రజా ఉద్యమాలు నేటితరం జర్నలిస్టులకు ఆదర్శమన్నారు. కానీ కొంతమంది జర్నలిజం విలువలను తగ్గించే ప్రయ త్నం చేస్తున్నారని వాటి వారిపై రకరకాలుగా కఠినంగా పోరాడుతున్నామన్నారు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ములుగు, జగదేవ్పూర్, వర్గల్ మండలాల్లో సభల్లో భాగంగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రముఖ వ్యక్తుల ద్వారా జర్నలిజం విలువలపై అవగాహన క ల్పించమన్నారు.
గజ్వేల్ ప్రెస్ క్లబ్ పై బురద జల్లడం ఐక్యతలో విచ్చినం తేవడానికి కొన్ని శక్తులు కుట్రపడ్డాయని ఆశక్తులకు ఈ రోజు జరుగుతున్న సభ మేము తెచ్చిన సావనీర్ కాలం పోరు పుస్తకమే సమాధానమని అ న్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు యా దవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి,
బేవరిజెస్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్,చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి బం డారు శ్రీకాంత్ రావు, డియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు రంగాచారి టీయూడబ్ల్యూకే జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, లోకసత్తా తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండా రు రామ్మోహన్ రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బట్టు దయానందరెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సంధబోయిన ఎల్లయ్య, స్థానిక విలేకరులు సత్యనారాయణ, ఎల్లారెడ్డి, విజయానందరెడ్డి, సురేందర్, మధు సూదన్, యాదగిరి, కిరణ్, కృపాకర్, నర్సింలు, శంక ర్, మునీర్ లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.