08-09-2025 09:57:46 PM
- రక్తదాన శిబిరం ఏర్పాటు, వార్డుల్లో కేకులు కటింగ్
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు పట్టణంలో సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోవింద్ సెంటర్, 19,20,21,22,23,24, వార్డుల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్ సెంటర్ లో 1,2,3, వార్డులలో ఉండబడే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆధ్వర్యంలో నిర్వహించగా, పాత బస్టాండ్ సెంటర్లో 4,5,6,7వార్డుల కాంగ్రెస్ పార్టీ నేతల/కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఆటో యూనియన్ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమ్ బజార్ లోని ముఖ్య సెంటర్ లో 8,16,17,18 వార్డు కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో/ఆర్య వైశ్య కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించగా, జగదంబ సెంటర్లోని కారేపల్లి ఆటో స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నేతల/ ఆటో యూనియన్ నేతల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్లో 9,10,11,12,13,14,15, వార్డుల కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే గౌరవ కోరం కనకయ్య ప్రారంభించారు. సింగరేణి క్యాంపు కార్యాలయంలో, మధ్యాహ్నం ఇల్లందు పురపాల సంఘం మహిళ పారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టగా, ఇల్లందు ప్రాంతంలోని మున్సిపాలిటీ పరిధి, మండల పరిధి లోని ఆటో కార్మికులకు సుమారు 1000 మందికి వారు చేసే పనికి సంబంధించిన చొక్కాలను (దుస్తుల) పంపిణీ ఎమ్మెల్యే కోరం కనకయ్య నాయకత్వంలో పంపిణీ చేశారు.