calender_icon.png 9 September, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొట్లకుంట చెరువును కబ్జాదారుల నుంచి కాపాడాలి

08-09-2025 10:27:58 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): బొట్లకుంట చెరువును రియల్ ఎస్టేట్ కబ్జాదారుల నుంచి కాపాడి ఎఫ్ టి ఎల్ నిర్మించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలోని బొట్లకుంట చెరువు ప్రాంతంలోని ఇందిరమ్మ గద్దేను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారన్నారు. ఆ చెరువుకు గొలుసు కట్టు ద్వారా  గంపల పల్లి చెరువు నుండి సాగునీరు ప్రవహించేది అన్నారు. ఇటీవల కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బోట్లకుంట మత్తడిని ధ్వంసం చేసి చెరువు పరిధిలోని ఇందిరమ్మ గద్దెను, సాగునీటి కాలువను ను కబ్జా చేసి అమ్మకాలు సాగిస్తున్నారని కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపార పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నాగుల కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.