08-09-2025 10:08:13 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ లో పలు చోరీలకు పాల్పడుతూ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను స్థానికులు పోలీసులకు అప్పగించారు. విచారించిన పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన బానోత్ వినోద్ కుమార్ (31) గత నెల 23న సొంత ఊరు మహబూబ్ నగర్ కి వెళ్లి 30న ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళం,బీరువ తాళం పగలగొట్టి ఉన్నది వెళ్లి చూడగా ఇంట్లో నగదుతో పాటు 2 తులాల బంగారం,వెండి,ల్యాప్ ట్యాప్ కనిపించడం లేదు.
దీంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.అదే ప్రాంతంలో గణేష్ నిమజ్జనం కోసం వెళ్లిన మరో రెండు ఇండ్లలో కూడా దొంగలు నగదు, ఐరన్ బాక్స్, వంటివి దొంగిలించారు.కాగా ఆదివారం కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న తల్లి,కొడుకును స్థానికులు పట్టుకుని బ్యాగ్ చెక్ చేయగా అందులో రాడ్, అనుమానాస్పద వస్తువులు లభించాయి.వారిని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.నిందితుడు చిలకా నగర్ కు చెందిన దుర్గేష్ (20) గా గుర్తించారు.వారిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసు లు తెలిపారు.దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నామని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.