08-09-2025 10:00:21 PM
మణుగూరు,(విజయక్రాంతి): మాలలకు అన్యాయం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వా నికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని, మాల మహానాడు నియోజకవర్గ ఇంచార్జ్ వెన్న అశక్ కుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్త మాలల ఆందోళనలో భాగంగా సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. ఎస్సీ
వర్గీకరణ చేసి మాలలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
గద్దెదించే వరకు మాలలు అలుపెరగ కుండా పోరాడతారని తెలిపారు. తెలంగాణ ఎస్సీ ఉద్యోగు ల్లో 46 వేల మంది మాదిగలు ఉంటే, 36 వేల మంది మాలలు ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ తోపాటు, రోస్టర్ విధానంపై పున రాలోచన చేయాలని డిమాండ్ చేశారు.