08-09-2025 10:30:26 PM
పెన్ పహాడ్: గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములై మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోవాలని ఎంపీడీవో జానయ్య కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చెట్లముకుందాపురం గ్రామపంచాయతీని సందర్శించి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే నిధులు ప్రాధాన్యమని అందులో భాగంగానే ఆ గ్రామస్తులు నీటి తరవాయి, ఇంటి పనులు సకాలంలో చెల్లించి గ్రామపంచాయతీ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పశువుల కొట్టాలను లబ్ధిదారులు ఇండ్లలో నిర్మిస్తున్న పనులను ఆయన పరిశీలించారు. అంతేకాక జీపీ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం గ్రామపంచాయతీ రికార్డ్స్లను అయన పరిశీలించారు.