08-09-2025 09:48:54 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలో ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో కొన్ని ఎంపీటీసీ కేంద్రాల పరిధిలో ఓట్ల తేడా ఉందని వాటిని పరిశీలించి తేడాలను సరిచేయాలని మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.సోమవారం ఈ విషయంపై మండల పరిషత్ అధికారి సరోజ కు ఆయన వినతిపత్రం అందజేశారు.మండలంలోని పొనుగోడు 1,పొనుగోడు 2,గరిడేపల్లి 1,గరిడేపల్లి 2 ఎంపీటీసీ పరిధిలో ఓట్లలో భారీ తేడా (వ్యత్యాసం) ఉన్నాయని ఆయన తెలిపారు.పొనుగోడు 1 ఎంపిటిసి కేంద్రం పరిధిలో 2837 ఓట్లు ఉన్నాయని,పొనుగోడు 2 ఎంపీటీసీ కేంద్రం పరిధిలో3651 ఓట్లు ప్రకటించిన జాబితాలో నమోదయాయని తెలిపారు.దీంతోపాటు గరిడేపల్లి 1 పరిధిలో 2775 ఓట్లు నమోదు అయ్యాయని,గరిడేపల్లి 2 ఎంపీటీసీ కేంద్రం పరిధిలో 4875 ఓట్లు జాబితాలో నమోదైనట్లు తెలిపారు.సంబంధిత ఎంపీటీసీ కేంద్రాల పరిధిలో ఓట్ల వ్యత్యాసం ఎక్కువగా ఉందని దీనిని గమనించి అన్ని ఎంపీటీసీల పరిధిలో ఓట్లు సమానంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.