calender_icon.png 9 September, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఓటర్ల జాబితాపై సమావేశం

08-09-2025 09:55:31 PM

చేగుంట,(విజయక్రాంతి): రాబోయే మండల పరిషత్, జెడ్పిటిసి, ఎన్నికల ఓటర్ల జాబితా, డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ల జాబితా లో గల అభ్యంతరాలపై ఎంపీడీవో కార్యాలయంలో   వివిధ పార్టీల అధ్యక్షులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చిన్నరెడ్డి, మాట్లాడుతూ మండలంలో ఒక జడ్పిటిసి, 11 ఎంపీటీ స్థానాలు , 71  పోలింగ్ బూతుల జాబితా లను వివరించారు. ఇట్టి జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా తెలియజేయాలని, తెలియజేసిన అభ్యంతరాల పరిశీలనతో, పాటు వాటి పరిష్కారానికి జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి నివేదిక పంపించడం జరుగుతుందని ఎంపీడీవో  తెలుపగా, ప్రస్తుతం ఉన్న జాబితాలో ఎలాంటి లోటుపాట్లు, అభ్యంతరాలు లేవని తెలిపినట్లు ఎంపీడీవో తెలిపారు.