08-09-2025 09:51:15 PM
చిన్నశంకరంపేట/చేగుంట(విజయక్రాంతి): చిన్నశంకరంపేట మండలంలోని ప్రజావాణి కార్యక్రమంలో పాఠశాల నిధుల అవకతవకలపై చందంపేట గ్రామపంచాయతీ మాజీ వార్డ్ మెంబర్ నాయిని ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.చిన్నశంకరంపేట మండలం చందంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ప్రమాదకరమైన చెట్లను 35,000లకు అక్షరాల ముప్పై ఐదువేల రూపాయలకు అమ్మేసారు. ఇట్టి డబ్బులు పాఠశాల ప్రధానోపాధ్యాయుని వద్ద ఉన్నాయి.
గ్రామస్తులు ఆగస్టు 15న రోజున పాఠశాలలోని సమావేశంలో నాయిని ప్రవీణ్ డబ్బుల లెక్క అడుగుతే ప్రధానోపాధ్యాయుడు స్పందించలేదని, చెట్లను అమ్మిన డబ్బులు ఎవరు వాడుకున్నారో చెప్పమని అడుగుతే, సమాధానం ఇవ్వడంలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై తాసిల్దార్ మాలతికి నాయిని ప్రవీణ్ కుమార్ వినతి పత్రం అందించగా మండల విద్యాధికారి పుష్ప వేణికి దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా వ్రాతపూర్వకంగా రాసిచ్చారు.