08-09-2025 01:06:23 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కాళోజీ సాహితీ పురస్కారం - 2025కి ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవి ఎంపికయ్యారు. అ వార్డుల కమిటీ ఈ మేరకు ఆమెను ఎంపిక చేయగా, సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆ ఎంపికను ఆమోదించారు. ఈమేరకు ‘భాషా సంస్కృతిఖ శాఖ’ ప్రకటన వెలువడింది.
ప్ర జాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా యేటా సెప్టెం బర్ 9న ఆయన పేరిట రాష్ట్రప్రభుత్వం సా హిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది. పురస్కార గ్రహీత నెల్లుట్ల రమాదేవి మంగళవారం సాయంత్రం రవీంద్రభారతిలో జ రుగనున్న కాళోజీ జయంతి వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి పురస్కారం అందజేయనున్నారు.
ఆమె రచనలు..
రమాదేవి 1962 జనవరి 12న స్టేషన్ ఘనపూర్‌లో జన్మించారు. ఎస్‌ఎస్‌సీ వరకు ఆమె స్టేషన్ ఘనపూర్‌లో చదివారు. ఇంటర్మీడియట్ , డిగ్రీ హైదరాబాద్‌లోని నారాయణగూడా రెడ్డి కాలేజీలో చదివారు. వరంగల్ కేయూలో ఎంఏ పూర్తి చేశారు. ఆంధ్రాబ్యాంక్‌లో సాధారణ ఉద్యోగిగా ప్రయాణం సాగించి, బ్యాంక్ సీనియర్ బ్యాంక్ మేనేజర్‌గా ఎదిగారు. పెద్ద హోదాలో ఉంటూ ఉద్యోగ విరమణ చేశారు. రమాదేవికి చిన్నప్పటి నుంచే తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉండేది.
అలాగే చిత్రకారిణిగా చిన్న బొమ్మలు చేస్తూ కార్టూనిస్ట్ గాను ఎదిగారు. ‘మనసు భాష’, ‘అశ్రువర్ణం’ కవితల సంకలనాలు, ‘రమణీయం’ పేరిట ప్రచురించిన కార్టూన్లు ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి. ‘మనసు మనసుకూ మధ్య’ కథలు, ‘చినుకులు’ నానీలు, ‘తల్లి వేరు’ కథలు ఆమె ఇతర రచనలు. డీ కామేశ్వరి కథలపై ఆమె ఒక మోనోగ్రాఫ్- కూడా రాశారు. రమాయణం--1 పేరుతో రాసిన కాలమ్స్ కూడా ఒక పుస్తకంగా ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతం ఆమె బ్యాంకు ఉద్యోగులకు ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇస్తున్నారు. కొన్ని కాలేజీల్లో, స్కూల్స్ లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లో సభ్యురాలి హోదాతో పాటు వ్యక్తిగత స్థాయిలోనూ అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అవుతున్నారు. ఆమె సాహిత్యంలో చేసిన కృషికి సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం, అపురూప అవార్డు, తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ రచయిత్రి పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (ఇప్పటి సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీ) కీర్తి పురస్కారం అందుకున్నారు