calender_icon.png 9 September, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

104, 108 వ్యవస్థలు వైఎస్ఆర్ ఆత్మ

08-09-2025 10:05:40 PM

పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..

ఆదిలాబాద్,(విజయక్రాంతి): 104, 108 వ్యవస్థ లు సీఎం స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ అని, వాటిని రక్షించు కోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. గత 17 సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న 104 ఉద్యోగులకు కనీసo  వేతనాలు లేకుండా విధులకు హాజరవుతున్న పరిస్థితి ఉన్నదన్నారు. 104 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ...గత 5 నెలలుగా వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. అలాగే ఉద్యోగాల కంటిన్యూషన్ పై స్పష్టత ఇవ్వకపోవడం వల్ల, ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. అనేక మార్లు ఉన్నత అధికారులను కలిసి విన్నవించినా సమస్య పరిష్కారించగా పోవడంతో ధర్నా చేపట్టారిని తెలిపారు. వర్షాకాలం, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో 104 ఉద్యోగుల పని చేస్తున్న చోట వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.